![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -319 లో.. కళ్యాణ్ కవితలు రాస్తుంటే.. అనామిక వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. కవితలు రాస్తున్నానని కళ్యాణ్ చెప్పగానే.. ఇంట్లో అందరు ఆఫీస్ కి వెళ్తున్నారు ఒక్క నువ్వు తప్ప.. ఆ కావ్య కూడ వెళ్తుంది. ఇలా ఉంటే ఇంట్లో నాకు నీకు విలువ ఉంటుందా? నువ్వు కూడా ఆఫీస్ కి వెళ్ళాలని అనామిక చెప్తుంది. నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నేను ఒక బోర్డు మెంబెర్ ని అని కళ్యాణ్ చెప్తాడు. మీ అమ్మ కూడా నీకు విలువ ఇవ్వట్లేదని బాధపడుతుంది కదా.. నాక్కూడా అలాగే ఉంటుంది కదా.. అని అనామిక చెప్తుంది. దాంతో సరే ఆలోచిస్తానని అనామికని పంపించి.. మళ్ళీ కవితలు రాస్తుంటాడు కళ్యాణ్.
ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లకుండా కావ్య బయటే ఉండడం చూసిన అపర్ణ.. కావ్యని పిలిచి ఎందుకు వెళ్ళలేదని అడుగుతుంది. క్యాబ్ కోసం వెయిటింగ్ అని కావ్య చెప్తుంది. అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి.. మీకు షేర్ ఆటో అలవాటే కదా.. అందులో వెళ్లకపోయావని చులకనగా మాట్లాడుతుంది. అది చూడలేని అపర్ణ.. ఈ ఇంటి వారసుడి భార్యవి నువ్వు.. నువ్వు క్యాబ్ లో వెళ్లడమేంటని తన కార్ కీస్ తీసుకొని వచ్చి.. కావ్యకి ఇచ్చి డ్రైవర్ బయట ఉన్నాడని చెప్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావని ఇందిరాదేవి అంటుంది. కావ్య ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. థాంక్స్ అని కావ్య చెప్పగానే.. నీపై ప్రేమతో ఇదంతా చెయ్యట్లేదు. నువ్వు ఇంటి పెద్దకోడలిగా ఆఫీస్ కి వెళ్తున్నావ్.. ఆ గౌరవం కోసం చేస్తున్నానని అపర్ణ చెప్తుంది. దాని తర్వాత కావ్య వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి ప్రకాష్ దగ్గరికి ధాన్యలక్ష్మి వెళ్లి.. ఆ కావ్య ఆఫీస్ కి వెళ్ళింది. మన కళ్యాణ్ కి వాల్యూ లేదని అంటుంటే అలా మాట్లాడకని ప్రకాష్ చివాట్లు పెడతాడు. మరొకవైపు అలసిపోయి వచ్చిన అప్పు.. తన ఫ్రెండ్ అన్న మాటలు గుర్తుకు చేసుకొని బాధపడుతుంది.
ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్లేసరికి స్టాఫ్ అంత కావ్యకి వెల్ కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. దాంతో ఎవరు వస్తున్నారని రాజ్ అడుగుతాడు. అప్పుడే కావ్య హుందాగా కార్ లోనుండి దిగి వస్తుంటే.. రాజ్ షాక్ అవుతాడు. అందరు తనకి వెల్ కమ్ చెప్తారు. రాజ్ కోపంగా క్యాబిన్ లోకి వెళ్తాడు. సుభాష్ సర్ ఫోన్ చేసి ఇదంతా చేయమని చెప్పారు సర్.. మేడమ్ కి అపాయింట్మెంట్ లెటర్ కూడా మీ చేతితో ఇవ్వమన్నారు లేదంటే ఫోన్ చెయ్యమన్నారని తను చెప్తుంది. కాసేపటికి కావ్యకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాడు రాజ్. తరువాయి భాగంలో రాజ్ కి శ్వేత ఫోన్ చేయడంతో హడావిడిగా వెళ్తాడు. కావ్య కూడ రాజ్ వెనకే వెళ్తుంది. అక్కడ రాజ్ , శ్వేత మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |